![]() |
![]() |

సన్ జెమినిలో వస్తున్న మాస్ జాతర కామెడీ షోకి కొత్త యాంకర్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. అతనే అమరదీప్ . రావడమే బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టయిలిష్ లుక్ లో వచ్చాడు. " నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నన్ను ఎన్నో రకాలుగా ఆదరించారు, అభిమానించారు, తోడుగా ఉన్నారు, నన్ను నిలబెట్టారు. నన్ను ఈరోజు ఈ పొజిషన్ కి తీసుకొచ్చారు. యాంకర్ గా నా కొత్త ప్రయాణాన్ని సన్ జెమినిలో మొదలవబోతోంది. ఈ ప్రయాణంలో మీరంతా నాకు తోడుగా ఉంటారని , ఆదరిస్తారని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను.
మీ అందరికీ నా పాదాభివందనాలు." అంటూ తనను తానూ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఐతే లాస్ట్ వీక్ ఎపిసోడ్ వరకు దీపికా పిల్లి యాంకర్ గా చేసింది. ఇక ఇప్పటి నుంచి అమర్ యాంకర్ గా రాబోతోన్నాడు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వాళ్లంతా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ , ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోస్ లో చేస్తూ సీరియల్స్ చేస్తూ యాంకర్స్ గా కూడా రాణిస్తున్నారు.
అందులో సుధీర్ , వర్ష, రీతూ చౌదరి, పాగల్ పవిత్ర, బ్రహ్మముడి మానస్ ఇలాంటి వాళ్లంతా కూడా యాంకర్స్ గా చేశారు చేస్తున్నారు. ఇక ఇప్పుడు అమర్ యాంకర్ గా కొత్త అవతారం ఎత్తాడు. ఇక నెటిజన్స్ కూడా అమర్ కోసమే ఈ షో చూడాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అర్జున్ కళ్యాణ్ , విష్ణు ప్రియా, తేజస్విని గౌడ ప్రియాంక సింగ్, అరియనా అందరూ కూడా బెస్ట్ విషెస్ చెప్పారు.
![]() |
![]() |